Putting the Chat into Snapchat

Until today, we felt that Snapchat was missing an important part of conversation: presence. There’s nothing like knowing you have the full attention of your friend while you’re chatting. We could not be more thrilled to announce Chat.
Snapchat్‌ నిర్మించడం సంభాషణను ఏది ప్రత్యేకంగా చేస్తుందనేదాని గురించి మాకు ఎంతో బోధించింది. అదృశ్యం అయ్యే చిత్రాలను పంచుకోవడానికి మేము ఒక అప్లికేషన్ పై పనిచేయడం మొదటగా మొదలుపెట్టినప్పుడు, మేము ఎంత నేర్చుకోగలం అనేది మాకు ఏమాత్రం తెలియదు. మీరు ఎల్లప్పుడూ ఒక స్క్రీన్‌షాట్ తీసుకోవాలని మాకు గుర్తు చేయడానికి మా సహాధ్యాయులు త్వరపడేవారు. అది డిఫాల్ట్‌గా తొలగింపు భావనకు మమ్మల్ని తీసుకెళ్ళింది - మీకు కావాల్సింది మీరు ఉంచుకోండి, మరి మిగతా అంతటినీ మేము తుడిచివేస్తాం!
సంభాషణ దృశ్యరూపములో ఉన్నప్పుడు బాగా అనిపిస్తుందని కూడా మేము తెలుసుకున్నాము. కాబట్టి, మీరు Snapchatని ప్రారంభించే ప్రతిసారీ మిమ్మల్ని నేరుగా కెమెరాకు తీసుకువెళ్ళేలా చూసుకోవడానికి మేం నిర్ణయించుకున్నాం. మీ స్మార్ట్ ఫోన్‌పై ఒక క్షణాన్ని పట్టేసి, పంచుకోవడానికి ఇది అత్యంత వేగవంతమైన మార్గము.
మా చివరి ప్రొడక్ట్ అప్‌డేట్‌తో, మేం కథ చెప్పడం యొక్క నిజమైన స్వభావాన్ని గౌరవించాము – ప్రతి కథకూ – ఒక ప్రారంభం, మధ్యభాగం మరియు ముగింపు ఇలా ఒక వరుసక్రమం ఉంటుంది. Snapchatters కథనాలను రూపొందించడానికి మరియు వాటిని కేవలం ఒక్కసారి తట్టడం ద్వారా వారి స్నేహితులందరితో పంచుకునేలా సహాయపడేందుకు మేం స్టోరీస్ నిర్మించాం.
అయితే నేటి వరకూ, Snapchat ఒక ముఖ్యమైన సంభాషణా భాగాన్ని కోల్పోతున్నదని మేము భావించాము: అదే 'ఉనికి'. మీరు చాటింగ్ చేస్తున్నప్పుడు మీ స్నేహితుడు పూర్తి శ్రద్ధగా ఉన్నట్లు తెలుసుకోవడం వంటిది ఏదీ లేదు.
చాట్‌ ప్రకటించడానికి మించి మాకు మరో ఆనందం లేదు.
చాటింగ్ మొదలుపెట్టేందుకై మీ Snapchat ఇన్-బాక్స్ లో మీ స్నేహితుడి పేరుపై కుడివైపు స్వైప్ చేయండి. మీరు చాట్ స్క్రీన్ వదిలినప్పుడు, మీరు మరియు మీ స్నేహితుడు ఇరువురూ వీక్షించిన సందేశాలు తుడిచివేయబడతాయి - ఐతే మీరు ఉంచాలనుకుంటున్న దేనినైనా (చిరునామాలు, చేయాల్సిన పనుల జాబితాలు, మొ.) సేవ్ చేయడానికి మీలో ఎవ్వరైనా ఎల్లప్పుడూ తట్టవచ్చు చేయవచ్చు లేదా స్క్రీన్ షాట్ తీయవచ్చు.
మీ చాట్‌‌లో ఒక స్నేహితుడు ఇక్కడ ఉన్నప్పుడు మేం మీకు తెలియజేస్తాము, తద్వారా మీరు పరస్పరం పూర్తిగా శ్రద్ధ పెట్టవచ్చు. మీరిద్దరూ ఇక్కడ ఉంటే, లైవ్ వీడియో పంచుకోవడానికి కేవలం నొక్కిపట్టి ఉంచండి - మరియు ముఖాముఖీ చాట్ చేయండి!
Back To News