Safety First

As communities continue preparing for and responding to the public health crisis posed by COVID-19, we wanted to share an update on our efforts to prioritize the health and safety of our Snapchat community, our partners, our team, and the world we all share together.
కమ్యూనిటీలు కొవిడ్-19 వల్ల కలిగిన ప్రజారోగ్య సంక్షోభానికి సిద్ధంకావడం మరియు ప్రతిస్పందించడాన్ని కొనసాగిస్తుండగా, మేం మా Snapchat కమ్యూనిటీ, మా భాగస్వాములు, మా టీమ్, మరియు మనందరం కలిసి పంచుకునే ప్రపంచ ఆరోగ్యము మరియు భద్రతను ప్రాధాన్యతీకరించడానికి మా ప్రయత్నాలపై ఒక అప్‌డేట్ పంచుకోవాలని కోరుకుంటున్నాం.
మా గ్లోబల్ టీమ్ భౌతిక దూరాన్ని పాటిస్తోంది మరియు వైరస్ యొక్క వ్యాప్తి వేగాన్ని నెమ్మదింపజేయడానికి సహాయపడే ప్రజారోగ్య ప్రయత్నాలకు తన వంతు కృషి చేస్తోంది. ఊహించని ఈ సవాలును మనమందరం కలిసి అధిగమించాలి కాబట్టి మా కమ్యూనిటీ మరియు భాగస్వాములకు చేయూతనివ్వడానికి మేమంతా కలిసి పనిచేస్తున్నాం.
ఆప్తమిత్రులు మరియు కుటుంబం దూరంగా ఉన్నప్పుడు సైతం వారిని Snapchat దగ్గర చేస్తుంది - మరియు ఈ సమయములో వ్యక్తులు టచ్‌లో ఉండేందుకు సహాయపడే అవకాశం పట్ల మేం కృతజ్ఞులుగా ఉన్నాం. మా సర్వీస్ అంతటా పెరిగిన నిమగ్నతను మేం చూశాము మరియు ప్రతిది సజావుగా సాగడానికి మేము కష్టపడి పనిచేస్తున్నాం.
వైరస్ వ్యాప్తిని ఆపడంలో Snapచాటర్స్ కీలక పాత్ర పోషిస్తారని మేం విశ్వసిస్తున్నాం. ప్రియమైనవారితో మాట్లాడటానికైనా, స్నేహితులతో ఆటలు ఆడేందుకైనా లేదా సమాచారం తెలుసుకోవడానికైనా — భౌతిక దూరం పాటిస్తూనే టెక్నాలజీ పూర్తి శక్తిని ఉపయోగించడం ద్వారా మా కమ్యూనిటీ సహాయపడవచ్చు.
సహాయం చేయడానికి గాను మేం చేస్తున్న కొన్ని పనులపై క్విక్ అప్‌డేట్ ఇదిగో:
  • సురక్షితంగా ఎలా ఉండాలనే దానిపై మా కమ్యూనిటీ సలహాతో వరల్డ్ వైడ్ ఫిల్టర్‌తో సహా Snapచాటర్స్ నిపుణులచే– ఆమోదించిన ఉత్తమ విధానాలను తమ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకునేందుకు సాయపడే క్రియేటివ్ టూల్స్‌ని మేం లాంఛ్ చేశాం. ఈ సమాచారము ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి సంగ్రహించబడింది, మరియు మరింత సమాచారం కోసం దాని వెబ్‌సైట్‌ లింక్‌లు.
  • నిపుణుల నుండి Snapచాటర్స్ తమకు తాముగా తాజా సమాచారం పొందేలా చూడటానికి మేం WHO మరియు డిసీజ్ కంట్రోల్ మరియు ప్రివెన్షన్ సెంటర్‌లతో సన్నిహితంగా పనిచేస్తున్నాం. Snapచాటర్స్ కొరకు WHO మరియు CDC తమ అధికారిక ఖాతాల నుండి క్రమం తప్పని అప్‌డేట్‌లను ప్రచురిస్తాయి మరియు కమ్యూనిటీ నుండి ప్రశ్నలకు జవాబివ్వడానికై అనుకూలమైన కంటెంట్ అభివృద్ధి చేయడానికి మేం WHO తో పనిచేశాం.
  • ప్రజలు అనుభవిస్తున్న ఆందోళన మరియు ఒత్తిడి నేపధ్యములో, మేము Here For You అనే ఒక కొత్త ఫీచర్ ప్రారంభాన్నివేగవంతం చేశాం, Snapచాటర్స్ మానసిక ఆరోగ్యం, ఆందోళన, నిరాశ, ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనలు, విచారము మరియు బెదిరింపుకు సంబంధించిన కొన్ని అంశాల కొరకు వెతికినప్పుడు అది స్థానికంగా ఉన్న భాగస్వామి నిపుణుల నుండి వనరులను చూపిస్తుంది. ప్రత్యేకించి కరోనావైరస్‌కు ప్రతిస్పందించడానికి, మేం కొత్త విభాగాన్ని కూడా జోడించాం, అది కొవిడ్-19 కి సంబంధించిన ఆందోళనపై WHO, CDC, Ad Council, మరియు Crisis Text Line చే ప్రచురించిన కంటెంట్‌ని చూపిస్తుంది.
  • మేము విశ్వసనీయమైన కంటెంట్ ను అందిస్తాం. మా కంటెంట్ ఫ్లాట్‌ఫారం Discover మెరుగుపరచబడింది, మేం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత విశ్వసనీయ వార్తాసంస్థలలో కొన్నింటితో సహా కేవలం ఎంపికచేసిన భాగస్వాములతో మాత్రమే సన్నిహితంగా పనిచేస్తాము. Snapchatters మరియు మా భాగస్వాములు, హాని కలిగించే తప్పుడు సమాచారమును గ్రహించే లేదా ఉద్దేశ్యపూర్వకంగా వ్యాప్తి చేసే విషయాలను పంచుకోవడాన్ని మా మార్గదర్శకాలు నిషేధిస్తాయి, అనుద్దేశిత ప్రచురణకర్తలు లేదా వ్యక్తులు తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేయుటకు అవకాశం లభించేలా మేము బహిరంగ న్యూస్ ఫీడ్ అందించం.
  • NBC News’ “StayTuned”, The Washington Post, SkyNews, The Telegraph, Le Monde, VG, Brut India, మరియు Sabqతో సహా మూడు డజన్ల కంటే ఎక్కువ మంది ఈ భాగస్వాములు కొవిడ్-19పై స్థిరమైన కవరేజీ అందిస్తున్నారు.
  • మా స్వంత వార్తా బృందము కూడా క్రమం తప్పకుండా కవరేజ్ కల్పిస్తోంది మరియు వైద్య నిపుణులతో ప్రశ్నలు మరియు జవాబులతో సహా నిరంతరాయంగా కొవిడ్-19 గురించిన చిట్కాలు మరియు సమాచారముతో Discover ని అప్‌డేట్ చేస్తోంది.
ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మా కమ్యూనిటీకి మద్దతు ఇవ్వడానికై మరిన్ని మార్గాలు కనుక్కోవడానికి మేమంతా కలిసి పనిచేస్తున్నాం. మేం మీ అందరి గురించే ఆలోచిస్తున్నాం, మరియు ఈ కష్టకాలములో ఎంతో ప్రేమను పంపిస్తున్నాం.
Back To News