24 మే, 2024
24 మే, 2024

Snap ఈ సంవత్సరపు EU ఎన్నికలకు సిద్ధమవుతోంది


జూన్ 6-9 తేదీల మధ్య, 27 దేశాలలో ఉన్న 370 మిలియన్లకుపైగా యూరోపియన్లు, యూరోపియన్ పార్లమెంటు కోసం వారి సభ్యులను ఎన్నుకోవడానికి ఓటింగ్ ‍బూత్‌లకు వెళతారు.

ఈ సంవత్సం ఆరంభంలో Snap, ఇటీవలే అదనంగా చేరిన జూలై4న జరిగే యుకె ఎన్నికలతోసహా 2024లో ప్రపంచవ్యాప్తంగా జరిగే 50 ఎన్నికలకు ఎలా సిద్ధమవుతోందో తెలియజేసింది. తప్పుడు సమాచారం, రాజకీయ అడ్వర్టైజింగ్, సైబర్‌‌సెక్యూరిటీ నిపుణులతోసహా దీర్ఘకాలంగా ఉన్న మా ఎన్నికల సమగ్ర బృందాన్ని రాబోయే ఎన్నికలలఓ చోటుచేసుకొనే సంబంధిత పరిణామాలను నియంత్రించేందుకు తిరిగి సమావేశపరచడంవంటివి ఉంటాయి.

ప్రపంచవ్యాప్తమైన ఈ ముఖ్యమైన పనితోపాటు, ప్రత్యేకించి యూరోపియన్ ఎన్నికలకు మేము ఏవిధంగా సిద్ధమవుతున్నామో మీతో షేర్ చేసుకోవాలనుకొంటున్నాము.

EU ఎన్నికలలో పౌర నిమగ్నతను ప్రోత్సహించడం

ఓటింగ్ వయస్సును 16కు తగ్గించాలన్న ఆస్ట్రియా, మాల్టా మరియు గ్రీస్‌లతో చేరడానికి బెల్జియం, జర్మనీలు కూడా నిర్ణయం తీసుకొన్నందున - ఈ యూరోపియన్ ఎన్నికలలో అర్హులైన మొదటిసారి ఓటర్లు ఎక్కువమంది ఉండబోతున్నారు.

పౌర నిమగ్నత అనేది, స్వీయ-భావవ్యక్తీకరణల రూపాలలో ఒక ముఖ్యమైనదని మేము నమ్ముతాము మరియు గతంలో మేము ఫ్రాన్స్, నెదర్లాండ్స్, మరియు స్వీడన్ ఎన్నికల అధారిటీలతో కలసి పనిచేసి, ప్రజలకు ఎన్నికలపట్ల అవగాహన కల్పించి, వారు పాల్గొనడాన్ని ప్రోత్సహించేందుకు కృషి చేశాము.

ఈ సంవత్సరపు EU ఎన్నికలకుముందు, ప్రజలు బయటకువచ్చి, ఓటువేసేందుకు ప్రోత్సహించేలా, మేము ఒక ప్రత్యేక AR లెన్స్‌పై యూరోపియన్ పార్లమెంట్‌తో జట్టుకట్టాము. ఎన్నికలలో, మేము EU స్నాప్‌చాటర్లందరితో ఈ లెన్స్ పంచుకోవడంతోపాటు, ఓటు వేయమని ఒక సందేశం ఇస్తున్నాము మరియు పార్లమెంట్ ఎన్నికల వెబ్‌సైట్‌కు లింక్ ఇస్తున్నాము.

   

అంకితమైనట్టి లెన్స్‌తో సహా ఎన్నికలపై వారి‘మీ ఓటును ఉపయోగించండి’ ’ సమాచార ప్రచారోద్యమాన్ని మరియు తప్పుడు సమాచారం, మరియు మోసపూరిత కంటెంట్ వల్ల కలిగే ముప్పులపై వారి అవగాహన ప్రచారోద్యమాన్ని ప్రోత్సహించడానికి Snapchat యూరోపియన్ పార్లమెంట్ మరియు యూరోపియన్ కమిషన్‌తో కూడా భాగస్వామ్యం వహిస్తోంది.

EU అంతటా తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడం

తప్పుడు సమాచారం వ్యాప్తి నిరోధకానికి మేము బద్ధులమై ఉన్నాము. మా కమ్యూనిటీ మార్గదర్శకాలు, డీప్‌ఫేక్స్ మరియు మోసపూరితంగా మార్చబడిన కంటెంట్ సహా తప్పుడు సమాచార వ్యాప్తి మరియు ఉద్దేశపూర్వకంగా తప్పుదారిపట్టించే కంటెంట్‌ను ఎప్పుడూ నిషేధిస్తాయి.

సాంకేతికతలు అభివృద్ధి అవుతున్న కొద్దీ, మానవ సృష్టి అయినా లేదా కృత్రిమ మేధస్సుచే ఉత్పన్నమైనవి అయినా సరే - అన్ని కంటెంట్ ఫార్మాట్లనూ కవర్ చేయడానికి మేము మా విధానాలను అప్‌డేట్ చేశాము.

EU ఎన్నికలకు మేము జరుపుతున్న సన్నద్ధతలో మేము:

  • ఓటర్లను మోసగించాలనే ఉద్దేశ్యంతో ఉండే AI జనరేటెడ్ కంటెంట్ వ్యాప్తిని గుర్తించేందుకు మరియు పరిమితం చేసేందుకు టూల్స్‌పై ఒకరికొకరు సహకరించుకొంటూ పనిచేసేందుకై, ఇతర టెక్నాలజీ సంస్థలతో కలసి AI ఎలక్షన్స్ ఎకార్డ్‌కు సైనప్ చేసింది.

  • మా కమ్యూనిటీ Snap సృష్టించిన AI కంటెంట్‌తో ఇంటరాక్ట్ చేస్తున్నప్పుడు అర్థం చేసుకోవడానికి వీలుగా సందర్భోచిత చిహ్నాలను పరిచయం చేశాము.

  • దీనితోపాటుగా, రాజకీయపరమైన అంశాలలో తలదూర్చకుండా ఉండేందుకు My AI సూచనలిచ్చాము.

  • EU అంతటా రాజకీయ యాడ్ వ్యాఖ్యానాలలోని వాస్తవాన్ని తనిఖీ చేయడంలో మద్దతిచ్చేందుకై, వాస్తవాలను తనిఖీ చేసే మరియు EU డిస్-ఇన్‌ఫర్మేషన్ కోడ్ ఆఫ్ ప్రాక్టీస్‌ యొక్క సిగ్నేటరీ అయిన Logicallyతో భాగస్వామ్యం కుదుర్చుకొన్నాము.

మా రాజకీయ మరియు అడ్వర్టైజింగ్ విధానానికి అనుగుణంగా EU నిర్ధారిత మార్పులు

సాధారణంగా Snapchatపై ఉండే రాజకీయపరమైన యాడ్స్, ఏదేశంలో ఆ యాడ్ ప్రచురించబడుతుందో, ఆ ప్రాంతపు ప్రజలు లేదా నివాసులు కానివారిచే ఇవ్వబడరాదు. అయితే, మేము ఇటీవల చేసిన మినహాయింపు ప్రకారం, EU-ఆధారిత ప్రకటనకర్తలు, Snapపై ఐరోపా అంతటా రాజకీయ ప్రకటనలు వేసుకోవచ్చు. ఈ మార్పు అనేది, ఇటీవల చేసిన EU పరిధిలో సీమాంతర రాజకీయ యాడ్స్ అనుమతిస్తూ EU చేసిన చట్టానికి అనుగుణంగా ఉంటుంది, కాని ఇది సభ్యులు కాని దేశాలనుండి యాడ్స్ నిరోధిస్తుంది.

ఈ చర్యలు, అన్ని రాజకీయ యాడ్స్ మా ప్లాట్‌పామ్‌లో ప్రచురించబడటానికిముందు జరిపే మానవ సమీక్షతో సహా కఠినమైన సమగ్ర రక్షణ చర్యలతో కొనసాగుతాయి.

ఈ చర్యలు మా కమ్యూనిటీ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రోత్సహిస్తాయని మరియు Snapchatను ఒక సురక్షితమైన, బాధ్యతాయుతమైన, స్పష్టమైన మరియు సహాయకారిగా ఉండే వార్తలు మరియు సమాచారం అందించే ప్రదేశంగా ఉంచేందుకు మద్దతునిస్తాయని మేము నమ్ముతున్నాము.

* లెన్స్ యొక్క చిట్టచివరి లైవ్ వెర్షన్ ఈ ముదస్తు సమీక్షల నుండి కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు.  

వార్తలకు తిరిగి వెల్దాం