Snapchat for Android

Snapchat is now available in the Google Play store for all Android devices running v2.2 or higher.
Snapchat ఇప్పుడు v2.2 లేదా ఆపై వెర్షన్ రన్ అవుతున్న అన్ని Android పరికరాల కొరకు Google Play స్టోర్లో లభ్యమవుతోంది.
ఇది కేవలం మా ఐఫోన్ యాప్ కాపీ కాదు. మేం ఒక నిజమైన Android యాప్ సృష్టించాలని కోరుకున్నాం, మరియు ఇది సరైనది అని భావించేలా చేయడానికి చాలా సమయాన్ని గడిపాం. అన్ని విభిన్న పరికరాలతో, ప్రతిదీ విభిన్న కెమెరా హార్డ్‌వేర్‌ని కలిగి ఉంది, ప్రతి యూజర్ కొరకు నిజంగా బాగా పనిచేసే ఒక యాప్‌ని అభివృద్ధి చేయడం చాలా కష్టమైన విషయం. పరికరంపై నేటివ్‌గా మద్దతు ఇవ్వనప్పటికీ, ఫుల్‌స్క్రీన్ కెమెరా ప్రివ్యూ అనుభవాన్ని ప్రతిఒక్కరికి అందించేలా ధృవీకరించడానికి, OpenGLలో పూర్తిగా కెమెరా లేయర్ నుంచి తిరిగి నిర్మించడం ద్వారా మేం ప్రారంభించాం. తరువాత మేం ఇమేజ్‌లు పంపడానికి మరియు వాటిని ఫీడ్‌లో లోడ్ చేయడానికి, మరియు ఎంతో మృదువైన కస్టమ్ ఇంటర్‌ఫేస్‌తో కలపడానికి ఒక కొత్త, ఆల్ట్రాఫాస్ట్ మార్గాన్ని అభివృద్ధి చేశాం. నిజంగా ఫస్ట్-క్లాస్ Android యాప్‌ని మీకు అందిస్తున్నందుకు మేం చాలా సంతోషంగా ఉన్నాం.
మీ మద్దతుకు మా ఫ్యాన్స్ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం – వేచి చూడటం ఎన్నడూ వినోదాత్మకంగా ఉండదని మాకు తెలుసు – మరియు మీ ప్రోత్సాహ ఇమెయిల్స్, ట్వీట్‌లు, మరియు facebook సందేశాలకు మేం నిజంగా ప్రశంసిస్తున్నాం. పొద్దుపోయేంత వరకు చేసిన ఆ పనిని మీరు నిజంగా విలువైనదిగా మార్చారు.
ఒకవేళ మీరు బగ్‌ని చూసినట్లయితే దయచేసి మాకు తెలియజేయండి! మేం కేవలం 250 పరికరాలపైన మాత్రమే టెస్ట్ చేయగలిగాం- మరియు ఇది Android ప్రపంచంలో చిన్నబిందువు మాత్రమే.
BTW ఐఫోనర్‌లు…త్వరలో రాబోతున్న అద్భుతమైన Snapchat రిలీజ్ కొరకు సిద్ధం అవ్వండి :)
Back To News