28 ఏప్రిల్, 2022
28 ఏప్రిల్, 2022

SPS 2022: New AR Shopping Capabilities for Brands

We are continuing to evolve AR shopping by launching a suite of new offerings making AR creation simple, fast, and cost-effective for businesses. And, we’re offering consumers new places to shop using AR, both on and off Snapchat.

Snap వద్ద మేము షాపింగ్ అనుభవాన్ని వ్యక్తిగతంగా, యాక్సెస్‌చేసేలా మరియు ఆగ్మెంటెడ్ వాస్తవికత ద్వారా ఆనందదాయకంగా ఉండేలా సరిక్రొత్త దృక్కోణాన్ని ఆవిష్కరిస్తున్నాము. గత సంవత్సరం జనవరి నుండి, దాదాపు 250మిలియన్లకుపైగా Snapchatters, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాండ్లు మరియు రిటెయిలర్లనుండి వస్తువులను ప్రయత్నించడం మరియు చూడటం వంటివాటికి AR షాపింగ్ లెన్సులను దాదాపు 5 బిలియన్ సార్లకంటే ఎక్కువసార్లు ఉపయోగించారు. షాపింగ్ అనుభూతులను పంచుకోవడానికి, వారు Snapchatను 1 ప్లాట్‌ఫారంగా ర్యాంక్ చేశారు.

మా బ్రాండ్ భాగస్వాములు Snap యొక్క కెమెరా సామర్థ్యాలను వారి ఆడియన్స్‌ను ఆకట్టుకొనేందుకు మరియు అన్ని పరిమాణాల వ్యాపారాలను మార్చేసేందుకు ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు, మా ట్రూ-టు-సైజ్ ఐవేర్ టెక్నాలజీని ఉపయోగించే Zenni ఆప్టికల్స్ AR లెన్సులను Snapchatters దాదాపు 60మిలియన్ సార్లకంటే ఎక్కువసార్లు ఉపయోగించారు మరియు ఇతర లెన్సులు లేకుండా పోల్చిచూసినప్పుడు, వారు 42% అదనంగా యాడ్ రిటర్నులను పొందగలిగారు.

AR సృష్టిని సులభతరం, వేగవంతం మరియు వ్యాపారానికి తగినట్లుగా ఖర్చుపరంగా తక్కువ ఉండేలా చేసి ఒక క్రొత్త ఆఫరింగుల సూట్‌ను ప్రారంభించడంద్వారా AR షాపింగ్‌ను ఆరంభించడాన్ని కొనసాగిస్తున్నాము. దీనితోపాటు, మేము వినియోగదారులకు, AR ఉపయోగించి, Snapchatపై మరియు ఆవల షాప్ చేసేందుకు క్రొత్త ప్రదేశాలను అందిస్తున్నాము.

సరిక్రొత్త AR క్రియేషన్ సూట్

Snap యొక్క 3D అస్సెట్ మేనేజర్ అనేది ఒక వెబ్ కంటెంట్ మేనేజ్‌మెంట్ వేదిక. ఇది వారి షాపింగ్ ఉత్పత్తుల కేటలాగ్‌లోని ఏ ఉత్పత్తికైనా వ్యాపారాలను అభ్యర్థించడం, ఆమోదించడం మరియు 3D మోడళ్ళని ఉత్తమంగా చూపడం వంటివి చేస్తుంది. అస్సెట్ షేరింగ్ సామర్థ్యాలతోపాటు రిటెయిలర్లు మరియు బ్రాండ్లు, స్నాప్ అస్సెట్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలో ఇప్పటికే ఉన్న ప్రముఖ బ్రాండ్ల ఆమోదించబడిన 3D మోడళ్ళను ఉపయోగించుకోవచ్చు.

భాగస్వాములు మా నూతన AR ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవచ్చు. Formaచే అభివృద్ధి చేయబడిన ఈ సామర్థ్యం వ్యాపార సంస్థలు, వారి ఇ-కామర్స్ వెబ్‌సైట్లకొరకు వారు తయారుచేసిన, ప్రస్తుతం ఉన్న ఉత్పత్తి ఫోటోగ్రఫీని ఉపయోగించుకోవడానికి మరియు వాటిని Snapchat AR ట్రై-ఆన్ లెన్స్ అనుభవాలకై టర్న్‌కీ AR-రెడీ అస్సెట్లుగా మార్చుకొనే అవకాశం కల్పిస్తుంది. ఈ టెక్నాలజీద్వారా, షాపర్లు మరిన్ని దుస్తులను మరింత సులభంగా, తమ ఇంటివద్దనుండే మరింతతేలికగా, కేవలం ఒక పూర్తి శరీరపు సెల్ఫీ తీసుకోవడంద్వారా ప్రయత్నించవచ్చు.

  • అంచె 1: భాగస్వాములు SKUలకై తమ వెబ్‌సైట్లపై అమ్మేందుకు ప్రస్తుతం వారివద్ద ఉన్న తమ ఉత్పత్తి ఫోటోగ్రఫీని అప్‌లోడ్ చేయాలి.

  • అంచె 2: ఉత్పత్తి ఫోటోగ్రఫీ, రిటెయిలర్ల ఫోటోగ్రఫీని AR ఇమేజ్ అస్సెట్లుగా మార్చే ఒక లోతైన-లెర్నింగ్ మాడ్యూల్ ద్వారా ప్రాసెస్ చేయబడుతుంది.

  • అంచె 3: ఆ తరువాత వ్యాపారసంస్థలు, ఒక సులభమైన వెబ్ ఇంటర్‌ఫేస్‌లో కొత్తవైన టెంప్లేట్లు ఉపయోగించి ట్రై-ఆన్ లెన్స్‌లను సృష్టించేందుకు AR ఇమేజ్ అస్సెట్స్ తో SKUలను ఎంచుకోవచ్చు.

లెన్స్ వెబ్ బిల్డర్‌లోని Snap నూతన AR షాపింగ్ టెంప్లేట్లు, బ్రాండ్లకు వారి అస్సెట్లను ఏవిధమైన అదనపు AR డెవలప్‌మెంట్ నైపుణ్యం అవసరం లేకుండా, వేగంగా మరియు సులభంగా ఇంపోర్ట్ చేసుకొనేందుకు మరియు కేటలాగ్-షాపింగ్ లెన్స్‌లను నిమిషాలలో సృష్టిస్తాయి. ప్రస్తుతం ఎంపికచేసిన భాగస్వాములవద్ద లభ్యమయ్యే బీటా వెర్షన్‌లో, దుస్తులు, ఐవేర్ మరియు ఫుట్‌వేర్‌ బ్రాండ్లు, తమ AR రెడీ అస్సెట్స్ ఉపయోగించి వర్చువల్ ట్రై-ఆన్ మరియు విజువలైజేషన్ అనుభవాలను నిర్మించుకొనేందుకు బ్యూటీ మర్చంట్లతో చేరవచ్చు. Snapchatters వస్తువులను మరింత వివరంగా లేదా అవి ప్రదేశంలో ఏవిధంగా అమరిపోతాయి అనేదాన్ని అన్వేషించేందుకై, ఏ 3D మోడల్ అయినా నేలపై లేదా టేబుల్‌పై ఉంచేలా అనువుగా ఉండే మా నూతన టెంప్లేట్ అభివృద్ధి చేస్తూ మేము ఫర్నీచర్ మరియు హ్యాండ్‌బ్యాగులు వంటి కేటగిరీలకు ఉపరితల ఉత్పత్తులకు కూడా మేము విస్తరిస్తున్నాము.

ఈ మూడు నూతన టెక్నాలజీలు అన్ని పరిమాణాలలోని వ్యాపారసంస్థలు, AR షాపింగ్ అనుభవాన్ని సులభంగా -పర్సనలైజ్ చేయబడి, షాపర్లకు అతిగొప్పదైన షాపింగ్ అవకాశాలను అందించేలా ఎనేబుల్ చేయబడ్డాయి.

డ్రెస్ అప్

షాపింగ్‌కై ARను ఉపయోగించేందుకు స్నాప్‌చాటర్లు ఇష్టపడతారు, అందువల్ల మేము స్నాప్‌పై డ్రెస్ అప్ అనిపిలవబడే ఒక సరిక్రొత్త, పూర్తిగా అంకితమైన గమ్యాన్ని ప్రారంభిస్తున్నాము. డ్రెస్ అప్ అనేది, AR ఫ్యాషన్‌లోని అత్యుత్తమైన దానిని మరియు సృష్టికర్తలు, రిటెయిలన్ర్లు మరియు ఫ్యాషన్ బ్రాండ్ల నుండి ట్రై-ఆన్ అనుభవాలు అన్నింటినీ ఒకేచోట చేరుస్తుంది.

ప్రస్తుతం లెన్స్ ఎక్స్‌ప్లోరర్‌లో లభ్యమవుతూ, త్వరలో AR బార్‌లోని కెమెరానుండి కేవలం ఒకే ట్యాప్ దూరంలో ఉన్న డ్రెస్ అప్ ప్రపంచవ్యాప్తంగా ఉండే సరిక్రొత్త దృక్కులను బ్రౌజ్ చేసేందుకు, కనుగొనేందుకు, పంచుకొనేందుకు మా కమ్యూనిటీని ఆహ్వానిస్తోంది. Snapchatters, ఇటీవల వారు ఇష్టపడిన, వీక్షించిన మరియు వారి కార్ట్‌కు చేర్చిన ఉత్పత్తులను కనుగొనగలిగే, తమ ప్రొఫైల్‌లోని ఒక సరిక్రొత్త షాపింగ్ విభాగానికి నావిగేట్ చేయడంద్వారా వారికిష్టమైన దుస్తులు మరియు అస్సెస్సరీలకు సులభంగా తిరిగి వెళ్ళవచ్చు. ఏ బ్రాండ్ లెన్స్‌లైనా, అవి వారి బ్రాండ్ ప్రొపైల్‌లో లభ్యమయ్యేటట్లయితే, డ్రెస్ అప్‌కు పరిగణించబడతాయి.

AR షాపింగ్‌కు కెమెరా కిట్

చివరగా, కెమెరా కిట్ ఫర్ AR షాపింగ్ అనేది, వ్యాపారసంస్థలు Snap కెమెరా మరియు AR ట్రై-ఆన్‌లను తమ స్వంత అప్లికేషన్లకు తీసుకొనివచ్చేందుకు అందించబడిన ఒక కొత్త ఆఫరింగ్.

ఈ SDK కేటలాగ్-ఆధారిత షాపింగ్ లెన్స్‌లను రిటెయిలర్లు మరియు బ్రాండ్ ఉత్పత్తి వివరాల పేజీలలోకి తీసుకువస్తాయి, అందువల్ల కస్టమర్లు Snap AR ట్రై-ఆన్ లేదా విజువలైజేషన్ ఉత్పత్తులకు అంటే ఐవేర్ లేదా హ్యాండ్‌బ్యాగులవంటి వాటిని వారు కలిగివుండే మరియు నిర్వహించే అప్లికేషన్లనుండి నేరుగా ఉపయోగించవచ్చు. కెమెరా కిట్ ఫర్ AR షాపింగ్, Android మరియు iOSలపై పనిచేస్తుంది మరియు త్వరలోనే వె‍బ్‌సైట్లలోకూడా పనిచేస్తుంది.

ప్యూమా, ఈ సాంకేతికతను ఉపయోగించిన Snap యొక్క మొట్టమొదటి గ్లోబల్ బ్రాండ్ భాగస్వామి. షాపర్లు Snap యొక్క కెమెరా కిట్‌తో శక్తిమంతమైన ప్యూమా స్నీకర్లను డిజిటల్‌గా ప్రయత్నించవచ్చు.

Snapchatపై లేదా వెలుపల షాపింగ్ అనేది బ్రాండ్లకు మరియు షాపర్లు ఇరుపక్షాలను ఎంతో తేలిక మరియు ఆనందకరంగా ఉంటుంది. ప్రజలు ఈ నూతన పరిమాణాల అనుభవాన్ని ఎక్కడ ఉపయోగిస్తారా అని మేము ఎదురుచూస్తున్నాము!

Back To News