28 ఏప్రిల్, 2022
28 ఏప్రిల్, 2022

Welcome to SPS 2022

Snapchat has changed a lot over the years, and our camera has become far more powerful – evolving from a way to communicate visually in a Snap into an augmented reality platform.

దిగువ ఇవ్వబడిన ముఖ్యాంశాలు, Snap Inc., యొక్క సిఇఒ ఎవాన్ స్పీజెల్, ఏప్రిల్ 28, 2022 న జరిగిన నాలుగవ వార్షిక భాగస్వాముల సదస్సులో చేసిన ప్రసంగంనుండి తీసుకోబడినది. మీరు ఈ పూర్తి వీడియోను ఇక్కడ వీక్షించవచ్చు.

హాయ్, 4వ వార్షిక భాగస్వామ్య సదస్సుకు మీ అందరికీ స్వాగతం!

ఈ రోజు మేము మీతో పంచుకోవడానికి ఎన్నో ఉత్సాహభరితమైన విషయాలను కలిగివున్నాము.

కాని, అన్నింటికంటే ముందు, మీ అందరినీ లాస్ ఏంజెలెస్‌లో ఇలా కలుసుకోవడం ఎంతో ఆనందకరంగా ఉందని నేను భావిస్తున్నాను.

మీ అందరీ భాగస్వామ్యానికి ధన్యవాదాలు.

మీతో కలిసి పనిచేయడాన్ని మేమెంతో ఆస్వాదిస్తున్నాము. ఇక ప్రస్తుతానికి వస్తే, ఆగ్మెంటెడ్ వాస్తవికతద్వారా ఒకప్పుడు ఆచరణ సాధ్యంకానిదిగా ఉన్న ప్రపంచంపై వ్యాప్తంగా విస్తరించి ఉన్న కంప్యూటింగ్ దూరదృష్టి నేడు మా కెమెరాతో సాధ్యమయింది.

ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్లకు పైగా చురుగ్గా ఉన్న వినియోగదారులతోపాటు, 600 మిలియన్లకు పైగా ప్రజలకు మా కమ్యూనిటీద్వారా సేవలందించడం ఎంతో ఆనందాన్నిస్తుంది.

మేము ప్రస్తుతం దాదాపు 20కి పైగా దేశాలలోని 13-34 సంవత్సరాల వయస్సువారిలో 75% పైగా ప్రజలకు చేరువవుతున్నాము. మా ప్రపంచవ్యాప్త కమ్యూనిటీ నిరంతరం పెరుగుతుండగా, రోజూవారీ యాక్టివ్ యూజర్ పెరుగుదల గత మూడూ సంవత్సరాలలో వరుసగా వృద్ధి చెందుతోంది.

గత కొన్ని సంవత్సరాలలో, Snapchat ఎంతో మారింది, మరియు మాకెమెరా- Snapలో ఒక ఆగ్మెంటెడ్ వాస్తవిక ప్లాట్‍ఫారంని చేర్చడంద్వారా కమ్యూనికేట్ చేసే విధానాన్ని మరింత శక్తివంతంగా చేసింది.

Snapchatపై మా కెమెరా ఉపయోగించి ఆగ్మెంట్ చేయబడిన వాస్తవిక లెన్స్‌లతో ప్రజలు రోజుకు సగటున 6 బిలియన్ సార్లు కమ్యూనికేట్ చేసుకొంటుంటారు.

ఈ రోజు మేము మా Snap భాగస్వామ్య సదస్సును ఉక్రెయిన్‌లోని మా బృంద సభ్యులకు అంకితమిస్తున్నాము. ఉక్రెయిన్, మన ఆగ్మెంటెడ్ వాస్తవిక ప్లాట్‌ఫారంకు పునాది వేసిన సంస్థ లూక్సెరీకి జన్మస్థలం.

మేము మీకందిస్తున్న ఉత్పత్తులు మరియు సేవలు, మా ఉక్రెయిన్ బృంద సభ్యుల సృజనాత్మకత, స్పష్టతలు సాధ్యమయ్యేవికాదు, అంతేగాక, అక్కడ జరుగుతున్న యుద్ధంలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం మా హృదయాలను కలచివేస్తోందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.

ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనాలని ప్రార్థిద్దాం.

ఆగ్మెంటెడ్ వాస్తవికత అనేది మనం చూసే దానిని, వాస్తవ ప్రపంచంలో మనం పొందే అనుభవాన్ని మిళితం చేస్తున్నందున, ఇది మనకు ఎంతో ముఖ్యమైనది. ఇది కంప్యూటింగ్‌ను, సరైన వాతావరణంలో, మన జీవితాలలో సాంకేతికతను నిరంతరం మిళితం చేసి సరిగ్గా వినియోగించేందుకు మనకు అవకాశమిస్తుంది.

మన ఆగ్మెంటెడ్ వాస్తవిక సాంకేతికత, స్వీయ భావప్రకటనకు ఒక ముఖ్యమైన సాధనంగా ప్రారంభించబడింది, కాని మన సృజనాత్మకతా భాగస్వాములవల్ల అది అనుకోనంతగా మారిపోయింది. క్రియేటర్లు మరియు డెవలపర్లు, మన కమ్యూనిటీకి కొత్త భాషలు నేర్చుకొనేందుకు, ఇంతకుముందు లేని ప్రత్యక్ష సంఘటనలను అనుభవించేందుకు, ఇంతకుముందు చెప్పబడని గాధలను వెల్లడిచేసే స్మృతులు నిర్మించేందుకు, ఒక సరిక్రొత్త స్నీకర్ల జతను ప్రయత్నించేందుకు విస్తృత శ్రేణిలోని AR అనుభవాలను నిర్మిస్తున్నారు.

ఆగ్మెంటెడ్ వాస్తవికతలోని మా పెట్టుబడులు, మానవీయతకు సేవ అందించేందుకు మరియు సహజంగా తెలుసుకొని, సులభంగా వినియోగించగలిగేలా ఉండే సాంకేతితను నిర్మించాలని మేము నిరంతరం కొనసాగించే ప్రయత్నాలను ప్రతిబింబిస్తాయి.

స్వీయ-భావవ్యక్తీకరణను మరింత బలోపేతం చేసేందుకు మేము కెమెరాలో Snapchat తెరవడం ప్రారంభించాము. ఆతరువాత, వ్యక్తిగతంగా కమ్యూనికేట్ చేసేలా మరియు వాస్తవ మిత్రులను కనెక్ట్ చేసేలా మేము డిజిటల్ కమ్యూనికేషన్‌ను అశాశ్వతం చేశాము. ప్రజలు పూర్తిస్థాయిలో తమ మానవీయ అనుభూతులను సౌకర్యవంతంగా వెల్లడి చేయాలని మేము ఎప్పుడూ కోరుకొన్నాము.

దీని ఫలితంగా, దాదాపు 90% పైగా Snapchatters, వారు Snapchat ఉపయోగించేటప్పుడు ఎంతో సౌకర్యవంతంగా, ఆనందంగా, కనెక్ట్ అయివున్నట్లుగా అనుభూతి చెందినట్లు తెలియజేశారు. (1)

అందువల్లనే, ఇతర యాప్‌లతో పోల్చిచూస్తే, Snapchat ఆనందకరమైన #1 ప్లాట్‌ఫారంగా ర్యాంక్ పొందింది. (2)

గత కొన్ని సంవత్సరాలుగా, మా భాగస్వాములు Snapchatను నిర్మించే మార్గాలను అన్వేషించడానికి, మరియు మా ఆగ్మెంటెడ్ వాస్తవికత అనుభవాలు, కంటెంట్, గేమ్స్ మరియు మరెన్నింటితో మా ఆడియన్స్‌ను చేరుకోవడాన్ని మేము కొనసాగిస్తున్నాము. దీనికి తగినట్లుగా మా భాగస్వాములు Snap కిట్, కెమెరా కిట్, మరియు Bitmoji ఇంటిగ్రేషన్లను ఉపయోగించడంద్వారా, స్నాప్ సాంకేతికతను తమ స్వంత యాప్‌లు మరియు సేవలలోకి తీసుకొని వస్తున్నారు. మా కమ్యూనిటీకి సృజనాత్మక ఉత్పత్తులు మరియు సేవలు అందించేందుకు ప్రస్తుతం మేము దాదాపు అర్థ మిలియన్ భాగస్వాములు, క్రియేటర్లు, డెవలపర్లతో పనిచేస్తున్నాము.

ఇప్పటికే, 250,000 మంది క్రియేటర్లు నిర్మించిన 2.5 మిలియన్లకు పైగా లెన్స్‌లు 5 ట్రిలియన్ సార్లకు పైగా వీక్షించబడ్డాయి.

ప్రస్తుతం 21 దేశాలలో 700కు పైగా డిస్కవర్ భాగస్వాములు ఉన్నారు, కాగా గత సంవత్సరం దాదాపు అరబిలియన్‌కు పైగా Snapchatters డిస్కవర్‌పై షోలను వీక్షించారు.

స్పాట్‌లైట్‌పై వెచ్చించే సమయం పెరుగుతూ ఉండగా, ప్రస్తుతం ప్రజలు గత సంవత్సరంతో పోల్చిచూస్తే స్పాట్‌లైట్‌కు 5 సార్లు ఎక్కువగా Snaps సమర్పిస్తున్నారు.

ప్రారంభించిన నాటినుండి, దాదాపు 340 మిలియన్లకుపైగా స్నాప్‌చాటర్లు గేమ్స్ మరియు మినీస్‌ని ఉపయోగించారు.

Snap మ్యాప్‌పై మా మొదటి రెండు లేయర్లు మెమొరీస్ మరియు ఎక్స్‌ప్లోర్‌లు ఆవిష్కరించబడిన నాటినుండి దాదాపు 100 మిలియన్‌సార్లకు పైగా ఉపయోగించబడ్డాయి.

Snap కిట్ డెవలపర్‌లు మరియు భాగస్వాములు Snapchatters తమను తాము వ్యక్తపరచేందుకు సహాయపడుతూ ఉంటారు. గత సంవత్సర కాలంలో, Snapchatters మా భాగస్వామ్య యాప్‌లనుండి, Spotify నుండి పాటలు, లేదా ట్విట్టర్ నుండి ట్వీట్లు వంటి కంటెంట్‌ను Snapchatపై 6 బిలియన్ సార్లకు పైగా పంచుకొన్నారు.

సానుకూల ప్రభావాన్ని చూపేందుకు ప్రయత్నిస్తున్నా మా తరువాతి తరానికి మద్దతిచ్చేందుకు మేము మా భాగస్వాములతో కలసి పనిచేస్తున్నాము.

గత అక్టోబర్‌లో Snapchatters ప్రజా సేవలో భాగమయ్యేందుకు తమ కమ్యూనిటీలో ఒక భిన్నంగా ఎలా వ్యవహరించాలో తెలుసుకొనేందుకు మేము 10 లాభాపేక్షలేని సంస్థలతో భాగస్వామ్యం ఏర్పరచుకొన్నాము.

మా మిత్రులు మరియు భాగస్వామ్య సంస్థలనుండి పొందుతున్న మద్దతుతో మేము Snapchatters స్థానిక నాయకత్వం గురించి మరింత తెలుసుకొనేందుకు, ఆహ్లాదకరమైన, ప్రభావవంతమైన మార్గాన్ని మా రన్ ఫర్ ఆఫీస్ మినీ నిర్వహిస్తున్నాము. వారు తీవ్రంగా పరిగణించే సమస్యలను విభజించి, స్పందించి, ఎన్నికలలో భాగమయ్యేందుకు మరియు స్థానిక స్థితులను అన్వేషించేందుకు Snapchatters తమ స్నేహితులను - అన్నింటినీ కేంద్రీకృతంచేయబడిన ప్రచార డ్యాష్‍బోర్డ్ ద్వారా నామినేట్ చేయవచ్చు.

ఇప్పటికే 4 మిలియన్లకుపైగా ప్రజలు రన్ ఫర్ ఆఫీస్ మినీని ఉపయోగించారు. మా భాగస్వాములలో ఒకరితో దాదాపు 25,000కు పైగా కలిగివున్న Snapchatters ఇప్పటికే తమ ప్రచారాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకొంటున్నారు.

మేము Snapchat కమ్యూనిటీ మరియు మా భాగస్వాములందరి ఉత్సాహం, సృజనాత్మకత, ఆశావహ దృక్పథాలనుండి స్పూర్తి పొందాము. మనందరం కలిసి పనిచేయడంద్వారా ఒక తేజోమంతమైన భవిష్యత్తును నిర్మించేందుకు మేము మీ అందరితో అనుబంధాన్ని కొనసాగించేందుకు ఎంతో ఉత్సుకతతో ఉన్నాము.

1. 2022 ఆల్టర్ ఏజెంట్లు Snap Inc.

2. 2021 Goodques Path to Purchase అధ్యయనం నియమించబడింది Snap Inc.

Back To News