Our Biggest Update Yet: v4.0 Phantom

It’s been a busy couple of months at Snapchat. With over 50 million snaps shared every day, we’ve had to do a lot of work to make sure our service can continue to support a growing community of snappers. Today, we’re thrilled to announce a major update to our iPhone application – video snaps!
Snapchat వద్ద కొన్ని నెలల పాటు తీరిక లేకుండా ఉంది. ప్రతిరోజూ 50 మిలియన్‌కు పైగా Snaps తో, మా సర్వీస్ snappers యొక్క ఎదుగుతున్న కమ్యూనిటీకి మద్దతును కొనసాగించేలా చూసుకోవడానికి మేం ఎంతో పని చేయాల్సి ఉంది. ఈరోజు, మా iPhone అప్లికేషన్ – video snapsకు ఒక పెద్ద అప్‌డేట్ ప్రకటించడం పట్ల మేం చాలా సంతోషంగా ఉన్నాం!
Snapchat అనేది అంతా, జరుగుతున్న క్షణాలను పంచుకోవడం గురించి, మరియు వీడియో అనేది ఆ క్షణాలను బంధించడానికి ఒక గొప్ప మార్గం. దురదృష్టవశాత్తూ, అనేక కెమెరా అప్లికేషన్లతో, మీ స్టిల్ కెమెరా నుండి మీ వీడియో కెమెరాకు మారి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న సమయానికి, మీరు ఆ క్షణాన్ని అదివరకే కోల్పోయి ఉంటారు. అది నిజంగా నిరాశపరచే విషయం. కాబట్టి మేము కొంత భిన్నమైనది నిర్మించాము - మరియు అది ఎంతో ఎక్కువ మేలు చేస్తుందని మేము అనుకుంటున్నాము.
ఫోటో మరియు వీడియో సెట్టింగ్ మధ్య ముందుకూ వెనక్కీ వెళ్ళే బదులుగా, మేం వాటిని ఒక బటన్‌లో కలిపేశాం. మీరు ఫోటో తీసుకోవాలనుకుంటే కేవలం బటన్‌ని తట్టండి. మీరు వీడియో తీసుకోవాలనుకుంటే బటన్‌ని కిందికి పట్టుకోండి. మీరు రికార్డింగ్ చేసేటప్పుడు వ్రేలిని ఎత్తి ఉంచండి. భలే సులువు. వీడియో snaps పది సెకెండ్ల వరకూ ఉంటాయి, ఫోటో snaps లాగా అప్లికేషన్‌లో ఒక్కసారి మాత్రమే చూడవచ్చు.
ఐతే అంతటితో అయిపోలేదు - ఈ అప్లికేషన్ చాలా గొప్ప విషయాలున్నాయి. ఫుల్-స్క్రీన్ వీక్షణతో, ల్యాండ్‌స్కేప్ శీర్షికలు జోడించి తీసుకోవడం మరియు పంపించడాన్ని మేం వేగవంతం చేశాము (మీ iDevice ని కాస్త త్రిప్పండి అంతే!) ఇంకా, మీకు ఎవరైనా snaps పంపించవచ్చు అని నిర్వహించడంలో సాయపడేందుకు కొత్త సెట్టింగ్స్ పేజీ ఉంది.
ఎప్పటిలాగానే మీ ఫీడ్‌బ్యాక్‌ని మేం ప్రశంసిస్తాం! మీకు సహాయం కావాలన్నా, లేదా ఊరికేే హాయ్ చెప్పాలన్నా మాకు ఇమెయిల్ చేయడానికి సందేహించవద్దు:support@snapchat.com
Back To News