We Stand Together

Snap CEO Evan Spiegel sent the following memo to all Snap team members on Sunday, May 31. In it he condemns racism while advocating for creating more opportunity, and for living the American values of freedom, equality and justice for all.
నా జీవితంలో తరువాతి దశలో, దక్షిణాఫ్రికాలో పని చేయడానికి, అధ్యయనం చేయడానికి నాకు అవకాశం లభించింది, అక్కడ నా హీరోలలో ఒకరైన బిషప్ టుటును కలిసే భాగ్యం నాకు లభించింది. నేను వర్ణవివక్ష మరియు జాత్యహంకారం యొక్క వారసత్వపు వినాశనాన్ని చూశాను, కానీ పురోగతి మరియు సయోధ్య దిశగా చేసిన అవిశ్రాంత ప్రయత్నాలను కూడా చూశాను. స్టాన్ఫోర్డ్లో, నేను నా సీనియర్ సంవత్సరంలో క్యాంపస్‌లోని నల్లజాతి సమాజానికి అంకితం చేయబడిన ఒక వసతిగృహం (మరియు ఇందులో ఎక్కువ మంది నివాసితులు నల్లజాతీయులు) అయిన ఉజామాలో నివసించాను. స్టాన్ఫోర్డ్ లో ఉన్న విపరీతమైన ప్రత్యేక సౌకర్యాల మధ్య కూడా, మన సమాజంలోని ప్రతీ రోజు జరిగే జాత్యహంకారపు అన్యాయాల గురించి తెలుసుకోవడానికి చాలా ఉండింది.
యునైటెడ్ స్టేట్స్ లోని నల్లజాతి అనుభవాల గురించి నేరైన అవగాహన గురించి సూచించాలని నేనిది పంచుకోవడం లేదు, కానీ దాదాపు 30 సంవత్సరాలుగా నేను అమెరికాలో మరియు ప్రపంచవ్యాప్తంగా న్యాయం కోసం ఉద్వేగభరితంగా మరియు నిరంతరంగా, సహేతుకంగా మరియు దృఢంగా విజ్ఞప్తి చేయడం వ్యక్తిగతంగా చూసాను లేదా దానిలో పాల్గొన్నాను. మార్పునకు పిలుపునిస్తూ మిలియన్ల మంది గొంతు కలుపుతున్నప్పటికీ 30 సంవత్సరాల తరువాత కూడా పురోగతి అంతగా కనిపించడం లేదని వివరించడానికి పంచుకుంటున్నాను. అమెరికాలో ఆర్థిక అసమానత అనేది దాదాపు ఒక శతాబ్దం కాలంలో చూడనంత స్థాయికి చేరుకుంది, శ్వేతజాతియేతరులు పర్యవసానాలు లేకుండా హత్య చేయబడతారనే భయం లేకుండా కిరాణా దుకాణానికి వెళ్ళలేరు లేదా జాగింగ్ కు వెళ్ళలేరు, సరళంగా చెప్పాలంటే, అమెరికన్ ప్రయోగం విఫలమవుతోంది.
MLK మాటల్లో, ‘‘అల్లర్లు అనేవి తమ గోడును అవతలివారు అలకించనప్పుడు, వారు వాడే భాష’’ అనీ మరియు శతాబ్దాలుగా మార్పు కోసం శాంతియుతంగా వాదిస్తున్నవారు అమెరికా చాలా కాలం క్రితం వాగ్ధానం చేసిన అందరికీ స్వేచ్ఛ, సమానత్వం మరియు న్యాయం అనే దృష్టికోణం దిశగా తక్కువ పురోగతిని చూశారని నేను అర్థం చేసుకున్నాను, కాబట్టి నేను దీనిని మీతో పంచుకుంటున్నాను. అల్లర్లు చేస్తున్న వారికి తాము చెప్పేది అవతలివారు వినిపించుకోవడం లేదని ఎందుకు అనిపించిందో నాకు అర్థమైంది.
మనం Snapchat సృష్టించిన తర్వాత, 2013, లో స్టాన్‌ఫోర్డ్ ఉమెన్ ఇన్ బిజినెస్ కాన్ఫరెన్స్‌లో మొదటి ప్రసంగం ఇవ్వడానికి నన్ను ఆహ్వానించినప్పుడు, అని నేనిలా ప్రకటించాను, “నేను యువ, తెల్లజాతీయుడనైన, విద్యావంతుడైన మగవాడిని. నాకు బాగా అదృష్టం కలిసివచ్చింది. మరియు జీవితం అందమైనది కాదు.” నా ప్రత్యేక హక్కును పేర్కొని, మన సమాజంలో అన్యాయాన్ని గుర్తించడం చాలా ముఖ్యం అని నేను భావించాను (ముఖ్యంగా రోజూ ఈ అన్యాయాలను ఎదుర్కునే మహిళా వ్యాపార నాయకురాళ్ళ ముందు). నా అధికారాన్ని అంగీకరించడం నాకు ఒక ముఖ్యమైన మొదటి అడుగు ఎందుకంటే ఇది వినడానికి నాకు సహాయపడింది. ధనవంతుడైన, శ్వేత జాతీయ పురుషుడిగా నా అనుభవాలు మన తోటి అమెరికన్లు అనుభవించిన అన్యాయాల కంటే వర్గీకరణపరంగా భిన్నంగా ఉంటాయి. నాకన్నా భిన్నమైన వారి దుస్థితిని అర్థం చేసుకోవడం అనేది పోరాటంలో మంచి సహచరుడుగా కావడానికి నాకు సహాయపడింది.
మన దేశం యొక్క సృష్టి వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచన ఏమిటంటే, మీ పుట్టిన పరిస్థితులు మీ జీవిత పథాన్ని ముందే నిర్ణయించలేదు అనే భావన. దేవుడు ఒక రాజును ఎన్నుకున్నాడు అనే ఆలోచన అర్థరహితమైనదని మన ఫౌండర్‌లు భావించారు - దేవుడు మనందరినీ ఎన్నుకున్నాడు మరియు మనందరినీ సమానంగా ప్రేమిస్తాడు. దేవుని ప్రేమను మరియు దేవుడు మనందరిలో నివసిస్తున్నాడనే ఆలోచనను ప్రతిబింబించే సమాజాన్ని నిర్మించాలని వారు కోరుకున్నారు. మనలో ఎవరూ కూడా ప్రేమకు ఎక్కువ లేదా తక్కువ అర్హులని దేవుడు నమ్మడు.
వాస్తవానికి, అందరికీ స్వేచ్ఛ, సమానత్వం మరియు న్యాయం అనే విలువలను అందించిన అదే వ్యవస్థాపక పితలు- ప్రధానంగా బానిస యజమానులు. ప్రజలచే, ప్రజల కోసం సృష్టించబడిన దేశం అనే వారి శక్తివంతమైన లక్ష్యం పక్షపాతం, అన్యాయం మరియు జాత్యహంకారం అనే పునాదిపై నిర్మించబడింది. ఈ శిథిలమైన పునాది మరియు అందరికీ అవకాశాన్ని కల్పించడంలో దాని కొనసాగుతున్న వైఫల్యాలను పరిష్కరించకుండా, మానవ పురోగతి కోసం మన నిజమైన సామర్థ్యాన్ని గ్రహించకుండా మనం వెనుకబడి ఉన్నాము - మరియు అందరికీ స్వేచ్ఛ, సమానత్వం మరియు న్యాయం అనే సాహసోపేతమైన లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమవుతూనే ఉంటాం.
వైవిధ్యం చూపడానికి మనము ఏమి చేయవచ్చని స్నేహితులు, టీమ్ సభ్యులు, జర్నలిస్టులు మరియు భాగస్వాములు నన్ను తరచుగా అడుగుతారు. నేను ఏ విధంగానూ నిపుణుడిని కాదని, 29 సంవత్సరాల పరిణితి చెందిన ఈ వయసులో నేను ఇంకా ఈ ప్రపంచ కార్యకలాపాల గురించి చాలా నేర్చుకోవలసి ఉందని తెలుసుకొని, అమెరికాలో మనం కోరుకునే మార్పును సృష్టించడానికి ఏమి అవసరమో అనే దానిపై నా స్వంత దృక్పథాన్ని క్రింద పంచుకుంటాను. వారి నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రజలందరికీ ఒకేసారి అవకాశాన్ని సృష్టించకుండా మనం వ్యవస్థలోని జాత్యహంకారాన్ని అంతం చేయలేము.
ఒక దేశంగా మన వ్యవస్థాపక విలువలైన స్వాతంత్ర్యం, సమానత్వం, న్యాయం, జీవితం, స్వేచ్ఛ మరియు ఆనందాన్ని సాధించడం పట్ల మన నిబద్ధతను పునరుద్ఘాటించడమే మొదటి మరియు అతి ముఖ్యమైన దశ అని నేను నమ్ముతున్నాను. భవిష్యత్ విజయాల కోసం భాగస్వామ్య దృష్టిని సృష్టించడానికి అంతేకాక మన పిల్లల పిల్లల కోసం అమెరికా ఎలా ఉండాలనుకుంటున్నామో నిర్వచించడానికి మనము కలిసి పనిచేయాలి. ఇది అమెరికన్లందరూ పాలుపంచుకునే ఒక ప్రక్రియ అయి ఉండాలి మరియు ఇది "ప్రజల చే, ప్రజల కొరకు." మనం కావాలనుకునే దేశాన్ని నిర్వచించగలిగితే, మనం చర్య తీసుకోవడం ప్రారంభించవచ్చు మరియు మన భాగస్వామ్య దృష్టిని సాకారం చేయడానికి తీసుకోవలసిన ముఖ్యమైన నిర్ణయాలకు మన విలువలను వర్తింపజేయవచ్చు.
GDP లేదా స్టాక్ మార్కెట్ వంటి అర్థంలేని స్వల్పకాలిక కొలమానాల పరంగా కాకుండా, మన విలువల నెరవేర్పు పరంగా మన విజయాన్ని నిర్వచించడం కూడా ప్రారంభించాల్సి ఉంటుంది. మీరు అందుకున్న విలువతో సంబంధం లేకుండా మీ ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరిగినప్పుడు, GDP పెరుగుతుంది. ఒక హరికేన్ తాకిడికి చాలా ఇళ్ళు కూలిపోయి, వాటిని పునర్నిర్మించవలసి వస్తే, జిడిపి పెరుగుతుంది. జిడిపి అనేది నిజమైన మానవ ఆనందానికి దోహదం చేసేదాన్ని ప్రతిబింబించని ప్రాథమికంగా విభజించబడిన కొలమానం. ఆనందం సాధించాలనే తపన, సంపద సాధించాలనే తపనను మించి విస్తరించాలి.
సత్యం, సయోధ్య మరియు నష్టపరిహారంపై విభిన్నమైన, పక్షపాతరహిత కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. అమెరికాలోని నల్లజాతి సమాజపు గళం దేశవ్యాప్తంగా వినిపించేలా చూడటానికి, పక్షపాతం మరియు దురభిప్రాయం ఉందా అని నేర న్యాయ వ్యవస్థను పరిశోధించడానికి, న్యాయ పౌర హక్కుల విభాగాన్ని బలోపేతం చేయడానికి మరియు సయోధ్య మరియు నష్టపరిహారం కోసం కమిషన్ చేసిన సిఫారసులపై చర్యలు తీసుకోవడానికి మనం ఒక ప్రక్రియను ప్రారంభించాలి. ప్రపంచవ్యాప్తంగా జరిగిన దారుణాల తర్వాత ఇలాంటి ప్రక్రియను చేపట్టే ధైర్యం ఉన్నవారి నుండి నేర్చుకోవలసినది చాలా ఉంది, మరియు మనం అమెరికన్ విలువలను ప్రతిబింబించే మరియు అవసరమైన మార్పు చేయడానికి మరియు కోలుకోవడానికి మన దేశానికి సహాయపడే ఒక ప్రక్రియను సృష్టించాలి.
స్వేచ్ఛాయుతమైన మరియు న్యాయమైన సమాజంలోని ఈ ప్రాథమిక అంశాలు ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా మరియు భరించేవిగా ఉండేలా చేయడానికి విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు గృహనిర్మాణంలో పెట్టుబడులను పెట్టడం ద్వారా అమెరికాలో “ఆపర్చునిటీ ఇంజిన్” ను మనము పునఃప్రారంభించాలి.
1980 ల నుండి అమెరికాలో వ్యవస్థాపకత గణనీయంగా తగ్గడానికి ఒక కారణం తగినంత సామాజిక భద్రతా నికరం లేకపోవడం అని నేను అనుకుంటాను. వ్యవస్థాపకత అనేది వ్యాపారాన్ని ప్రారంభించడానికి రిస్క్ తీసుకోగలగ వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది, ఇది నాకు ఉండిన భద్రతా నికరం లాంటిది లేకుండా చేయడం దాదాపు అసాధ్యం. నేటి కాబోయే పారిశ్రామికవేత్తలు విద్యార్థి రుణ భారంతో బాధపడుతూ, చలనం లేని వేతన పెరుగుదల మరియు పెరుగుతున్న ఖర్చులకు లోబడి ఉండడంతో వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన మూలధనాన్ని కూడబెట్టడాన్ని కష్టతరం చేస్తుంది.
మన పిల్లల పిల్లలకు ప్రయోజనం చేకూర్చడానికి మన దేశ భవిష్యత్తులో పెట్టుబడి పెట్టడం అనేది ఖర్చుతో కూడుకొన్నది. మనము మరింత ప్రగతిశీల ఆదాయ పన్ను వ్యవస్థను మరియు అధిక ఎస్టేట్ పన్నును ఏర్పాటు చేయవలసి ఉంటుంది మరియు అధిక పన్ను రేటు చెల్లించడానికి మనకు కార్పొరేషన్లు అవసరం. వేగంగా మారుతున్న మన ప్రపంచంలో భవిష్యత్తులో రాబోవగల ఏదైనా బాహ్య దాడులను ఎదుర్కోవడానికి మనం బాగా సిద్ధంగా ఉండడానికి వీలుగా మనము భవిష్యత్తులో పెట్టుబడులు పెడుతున్నప్పటికీ, ఫెడరల్ లోటును కూడా తగ్గించుకోవలసి ఉంటుంది. సంక్షిప్తంగా, నా లాంటి వ్యక్తులు చాలా ఎక్కువ పన్నుల రూపంలో చాలా ఎక్కువ చెల్లిస్తాం - మరియు ఇది మనందరికీ ప్రయోజనం చేకూర్చే సమాజాన్ని సృష్టించడం అంత విలువైనదని నేను నమ్ముతున్నాను.
వీటిలో చాలా మార్పులు వ్యాపారానికి స్వల్పకాలికంగా "చెడ్డవి" కావచ్చు, కాని అవి మన దేశ ప్రజలలో దీర్ఘకాలిక పెట్టుబడులను సూచిస్తున్నందున, మనం సమిష్టిగా అద్భుతమైన దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందుతామని నేను నమ్ముతున్నాను.
ఈ మార్పు ఇంకా ఎందుకు జరగలేదు? మన ప్రభుత్వంలోని అన్ని శాఖలలో గల బూమర్ల సూపర్ మెజారిటీ కారణంగానే వారి పిల్లలకు మంచి భవిష్యత్తును సృష్టించడానికి అంతగా ఆసక్తిని ప్రదర్శించలేదని నేను వాదిస్తాను. దశాబ్దాలుగా మన ప్రభుత్వం తమ అత్యంత ముఖ్య భాగాలైన బూమర్స్ ను సుసంపన్నం చేయడానికి రుణ-పెట్టుబడుల పన్ను కోతలు మరియు అర్హత వ్యయంల వ్యూహానికి కట్టుబడి ఉంది. నిజానికి, బూమర్స్ అమెరికాలోని గృహ సంపదలో దాదాపు 60% సంపదను కలిగి ఉన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే, బిలియనీర్లు 3% సంపదను కలిగి ఉన్నారు. ఉదాహరణకు, సాంఘిక భద్రతతో మేము అమెరికన్ చరిత్రలోని సంపన్న వర్గానికంతటికీ ఎలాంటి మీన్స్-టెస్టింగ్ లేకుండా ప్రయోజనాలను చెల్లించే కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేస్తాము.
ఒక పాత తరం తమను తాము యువ తరంలో చూసుకోలేనప్పుడు, వారు తమ భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడరని కొన్ని పరిశోధనలు నిరూపించాయి. అమెరికాలో, బూమర్ జనరేషన్ దాదాపు 70% శ్వేతజాతీయులు, మరియు జెన్ Z దాదాపు 50% శ్వేతజాతీయులు. అమెరికాలోని జనాభాకు సంబంధించిన మార్పు అనివార్యం. అందువల్ల, మన వ్యవస్థాపక విలువలను బాగా ప్రతిబింబించే, మన గతం యొక్క లోతైన గాయాలను నయం చేసే, జాత్యహంకారం మరియు అన్యాయాన్ని తొలగించడానికి ప్రయత్నించి మరియు అందరికీ (వారు ఎవరైనా, లేదా వారు ఎక్కడ జన్మించిన వారైన సరే) అవకాశాన్ని కల్పించే దేశాన్ని సృష్టించడానికి మనం కలిసి పనిచేయగలమా లేదా అనేది ప్రశ్న.
Snapchat విషయానికొస్తే, జాతి హింసను ప్రేరేపించే వ్యక్తులతో ముడిబడిన అమెరికాలోని ఎకౌంటులను మేం ప్రోత్సహించలేము, వారు ఆ పనిని మా ప్లాట్ఫామ్ లోపల చేసినా లేదా వెలుపల చేసినా కూడా. మా డిస్కవర్ కంటెంట్ ప్లాట్‌ఫాం అనేది ఒక క్యూరేటెడ్ ప్లాట్‌ఫాం, ఇక్కడ మేము ప్రోత్సహించేదాన్ని నిర్ణయిస్తాము. సానుకూల ప్రభావాన్ని చూపడానికి కృషి చేయడం గురించి మేము పదే పదే మాట్లాడాము మరియు Snapchat లో మేము ప్రోత్సహించే కంటెంట్‌ విషయంలో నిరర్థకమైన వాగ్ధానాలు చేయకుండా చెప్పింది చేస్తాం. Snapchat‌లో ప్రచురించబడిన కంటెంట్ మా కమ్యూనిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నంతవరకు, విభేదాలు సృష్టించే వ్యక్తులను Snapchat‌లో ఎకౌంటును కొనసాగించడానికి మేము అనుమతించవచ్చు, కాని మేము ఆ ఎకౌంటును గానీ, లేదా కంటెంట్‌ను గానీ ఏ విధంగానూ ప్రోత్సహించము.
ప్రేమ వైపుగా ప్రయాణించడం ఎప్పుడూ అసాధ్యం కాదు, మరియు మన వ్యవస్థాపక విలువలు, మన ఉనికికి అతి ముఖ్యమైన కారణాలైన అందరికీ స్వేచ్ఛ, సమానత్వం మరియు న్యాయం అనే వాటి కోసం మన గొప్ప దేశపు నాయకత్వం పనిచేస్తుందని నేను మనః పూర్వకంగా మరియు హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను.
ఆ రోజు వరకు, జాత్యహంకారం, హింస మరియు అన్యాయాల విషయానికి వస్తే తప్పొప్పులు నిర్దారించడం కష్టం కాదని మా చర్యలతో స్పష్టం చేస్తాము - అలాగే మేము మా వేదికపై దానిని కానీ, లేదా దానికి మద్దతు ఇచ్చేవారిని కానీ ప్రోత్సహించము.
ప్రజలు విభేదించే కంటెంట్ ను లేదా కొంతమంది వ్యక్తుల పట్ల స్పదించని ఎకౌంటులను మేము తొలగిస్తామని దీని అర్థం కాదు. మన దేశం యొక్క మరియు ప్రపంచం యొక్క భవిష్యత్తు గురించి చర్చలు చాలా జరిగాయి. కానీ మన దేశంలో మానవ జీవితపు విలువ గురించి మరియు స్వేచ్ఛ, సమానత్వం మరియు న్యాయం కోసం చేసే నిరంతర పోరాటపు ప్రాముఖ్యత గురించి చర్చకు తావు లేదు. శాంతి, ప్రేమ మరియు న్యాయం కోసం నిలబడే వారందరికీ అండగా నిలబడి ఉన్నాము మరియు చెడు కంటే మంచిని ప్రోత్సహించడానికే మా ప్లాట్ ఫామ్ ను ఉపయోగిస్తాము.
మన సమాజంలో "కొంతమంది" జాత్యహంకారాలు ఉన్నందుకే, లేదా "కొంత అన్యాయం" ఉన్నందుకే మనం "అందరమూ చెడ్డవారం అయిపోము" అని భావించే చాలా మంది వ్యక్తులు ఉన్నారని నాకు తెలుసు. నా అభిప్రాయం ఏమిటంటే మానవత్వం లోతుగా అంతర్గతముగా అనుసంధానించబడిందని మరియు మనలో ఒకరు బాధపడినట్లయితే, మనమందరం బాధపడుతున్నట్లే. మనలో ఒకరు ఆకలితో ఉన్నట్లయితే, మనమందరం ఆకలితో ఉన్నట్లే. మరియు మనలో ఒకరు పేదవారైనట్లయితే, మనమందరం పేదవాళ్ళమన్నట్లే. మనలో ఎవరైనా మన నిశ్శబ్దం ద్వారా అన్యాయానికి వీలు కలిపించినట్లయితే, మనమందరం దాని అత్యున్నత ఆదర్శాల కోసం కృషి చేసే దేశాన్ని సృష్టించడంలో విఫలమైనట్లే.
సమానత్వం మరియు న్యాయం కోసం మద్దతు ఇచ్చే సంస్థలకు Snap దోహదం చేస్తుందా అని మీలో కొందరు అడిగారు. దానికి సమాధానం అవును. కానీ నా అనుభవంలో, దాతృత్వం అనేది మనం ఎదుర్కొంటున్న తీవ్రమైన అన్యాయాలలో చెప్పుకోదగిన ఫలితము తేలేకపోతోంది. మా కుటుంబం నిరుపేదలకు అవకాశాన్ని కల్పించడానికి, న్యాయ సంరక్షకులకు విరాళం ఇవ్వడానికి అర్ధవంతంగా సహకరించినప్పటికీ మరియు సహకారాన్ని కొనసాగించినప్పటికీ, ఈ పరిస్థితులు మన సమాజంలో మరింత తీవ్రమైన పునర్వ్యవస్థీకరణకు పిలుపునిస్తున్నాయి. వ్యక్తిగత దాతృత్వం లోపాలను పూడ్చగలదు, లేదా పురోగతిని వేగవంతం చేయగలదు, కానీ అది మాత్రమే అన్యాయం అనే లోతైన మరియు విస్తృత అగాధాన్ని దాటలేదు. సమైక్య దేశంగా మనం కలిసి ఆ అగాధాన్ని దాటాలి. అందరికీ స్వేచ్ఛ, సమానత్వం మరియు న్యాయం కోసం పోరాడడంలో సమైక్యంగా ఉందాం.
మన ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. అమెరికాలో హింస మరియు అన్యాయాల సుదీర్ఘ వారసత్వాన్ని ఎదుర్కోవటానికి మనం లోతైన మార్పును స్వీకరించాలి, దీనికి తాజా బాధితులు జార్జ్, అహ్మౌద్ మరియు బ్రెయోనా, పేర్కొననివారు ఇంకా చాలా మంది ఉన్నారు. మార్పు మన దేశంలోనే మాత్రమే కాదు, మన హృదయాల్లో మార్పు రావాలి. మనం శాంతి అనే వెలుగును కొనసాగిస్తూ, మొత్తం మానవాళితో ప్రేమను పంచుకోవాలి.
మీకు శాంతి కలుగుగాక,
ఎవాన్
Back To News