Snap Partner Summit: Supporting Wellbeing

We believe Snapchat can play a unique role in empowering friends to help each other through these difficult moments. In March, we rolled out Here For You, a feature that provides Snapchatters with expert resources when they search for topics related to mental health and wellbeing.
ఆరోగ్యము మరియు సంతోషాన్ని అందించే నిజమైన స్నేహాలకు ఉండే శక్తితో మేము ఎల్లప్పుడూ స్ఫూర్తి పొందినాము. ఇది మా కమ్యూనిటికి ప్రత్యేకంగా వర్తిస్తుంది. అనేక అధ్యయనాల్లో తెలియజేసినట్లుగా -- ఒత్తిడి, ఆతురత, వ్యాకులత మరియు ఇతర అనేక మానసిక సవాళ్లతో వ్యవహరించేటప్పుడు వారు మొగ్గు చూపే మొట్టమొదటి వ్యక్తి వారి స్నేహితులు అని Snapచాటర్ ల యొక్క అనుభవాలపై జరిపిన కొత్త పరిశోధన ధృవీకరించింది.
ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో స్నేహితులు ఒకరికొకరు సాయపడేందుకు శక్తిని అందించడంలో Snapchat ఒక ప్రత్యేక పాత్ర పోషించగలదని మేము విశ్వసిస్తున్నాం. మార్చిలో, మానసిక ఆరోగ్యం మరియు స్వస్థతకు సంబంధించిన అంశాలను వెతికేటప్పుడు, Snapచాటర్ లకు నిపుణుల వనరులను అందించే ఒక ఫీచర్‌ని మేము ఇక్కడ మీ కోసం విడుదల చేసాము.
ప్రీమియం కంటెంట్, మరియు భాగస్వామ్యాల ద్వారా Snapచాటర్స్‌ మరియు వారి స్నేహితులకు తదుపరి మద్దతు అందించేందుకు డిజైన్ చేయబడ్డ అదనపు ఫీచర్‌లను ఇవాళ ప్రవేశపెడుతున్నాం:
  • అత్యుత్తమ కంటెంట్ మరియు వనరులను నేరుగా Snapchat లో అందించడానికి ధ్యానం మరియు పరిపూర్ణత విషయాల్లో అంతర్జాతీయ దిగ్గజమైన Headspaceతో మేము భాగస్వామ్యం చేస్తున్నాము. రాబోయే వారాల్లో, మన కమ్యూనిటీ తమ స్నేహితులపై తనిఖీ చేయడానికి సహాయపడేందుకు Headspace మార్గదర్శనంతో కూడిన స్వల్పకాలిక ధ్యానాలు మరియు టూల్స్‌ని అందిస్తుంది.
  • ఆసక్తి కలిగించే కంటెంట్ మానసిక రుగ్మతలను సులభతరం చేయడానికి మరియు అపోహలను తొలగించడానికి సాయపడుతుందని మేము నమ్ముతున్నాము, ఈ ఏడాది పూర్వార్థంలో మేం 10మంది యువకుల మానసిక ఆరోగ్య ప్రయాణానికి సంబంధించిన ‘‘మైండ్ యువర్‌సెల్ఫ్’’ అనే పేరు ఉన్న బార్‌క్రాఫ్ట్ డాక్యుమెంటరీ సీరిస్‌ని లాంఛ్ చేశాం. ఇవాళ మేం ఈ ఏడాది చివర్లో ప్రవేశపెట్టనున్న కొత్త Snap ఒరిజినల్స్‌ని ప్రకటిస్తున్నాం. లాఫ్ అవుట్ లౌండ్ నుంచి ‘‘కోచ్ కెవ్’’లో, కెవిన్ హర్ట్ తన వ్యక్తిగత అనుభవాల నుంచి స్ఫూర్తిని పొంది, కోచ్ మరియు మెంటార్‌ గా మారి, తన సానుకూలతను మరియు జ్ఞానాన్ని ఎవరైతే అత్యుత్తమ జీవితాన్ని జీవించాలని కోరుకుంటారో వారితో పంచుకుంటారు.
  • విపత్కర పరిస్థితుల్లో మా యాప్‌లో వనరులను Snapచాటర్‌ల కు అందుబాటు లో ఉంచడానికి సులభతరం చేస్తున్నాం. మా ఇన్-యాప్ రిపోర్టింగ్ టూల్స్‌ తమ స్నేహితులు స్వీయ హాని చేసుకునే ప్రమాదం ఉందని Snapచాటర్స్‌ ఆందోళన చెందినప్పుడు వారు మమ్మల్ని అలర్ట్ చేయడానికి అనుమతిస్తాయి, వారికి అందుబాటులో ఉండే సహాయం గురించి మేము ఆ స్నేహితుడికి తెలియజేస్తాము. ఎమర్జెన్సీ సర్వీస్‌లతో వారు ఏవిధంగా అనుసంధానం కాగలరు, శిక్షణ పొందిన కౌన్సిలర్‌కు క్రైసిస్ టెక్ట్స్ లైన్ ద్వారా సందేశం, లేదా నేషనల్ సూయిసైడ్ ప్రివెన్షన్ హాట్‌లైన్‌లో ఎవరితోనైనా లైవ్‌లో మాట్లాడటం వంటివి వెంటనే Snapచాటర్స్‌కు చూపించడం ద్వారా మేము ఇప్పుడు ఈ అనుభవాన్ని గణనీయంగా మెరుగుపరుస్తున్నాం.
ఈ ప్రయత్నాలను రూపొందించడానికి మరియు స్నేహితులకు సహాయం చేసేందుకు స్నేహితులకు శక్తి వంతం చేయటానికి మరిన్ని మార్గాలను అభివృద్ధి చేయడానికి మేం ఎదురు చూస్తున్నాం.
Back To News